728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 17, 2020

చిలకలూరిపేట పట్టణంలో భారీగా కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలో ఆదివారం రోజు పాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో 317 మందికి నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో కోవిడ్19 పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో పట్టణ ప్రాంతంలోని సుమారు 38 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. పట్టణంలో రోజు మార్చి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తే పట్టణంలో కేసులు తగ్గుతాయని ఈ పరీక్షలు రోజు మార్చి రోజు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ప్రైవేటు వైద్యశాలల్లో  కొంతమంది పరీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ పరీక్షకు సుమారు 1500 నుండి 2000 వరకు వసూలు చేస్తున్నారని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి తమ వైద్యశాలలో వైద్యం చేస్తామని కరోనా వైద్యానికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పాజిటివ్ పేషెంట్లకు చెబుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

అందువల్ల ప్రతి రోజూ కానీ, రోజు మార్చి రోజు కానీ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చిన పేద వారు పట్టణంలోని కోవిడ్ కేర్ సెంటర్లో వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చు పెట్టే స్తోమత లేని వారికి ఆ అవసరం ఉండదని పలువురు కోరుతున్నారు. అదియునుగాక పట్టణంలోని కోవిడ్ కేర్ సెంటర్ లో మంచి వైద్య చికిత్స అందించి పాజిటివ్ వారికి  నెగిటివ్ వచ్చిన తరువాత ఇళ్ళకు పంపిస్తున్నారని  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో భారీగా కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE