728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 17, 2020

కరోనా ప్రభావంతో శ్రీహరికోట ఇస్రో కార్యకలాపాల నిలిపివేత

నెల్లూరు జిల్లా:
★ నోవల్ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)పై కూడా పడింది.

★ సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌ (ఎస్‌డీఎస్‌సీ-షార్)లో కార్యకలాపాలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.

★ దీని ప్రకారం ప్రతి రోజూ జరిగే అన్ని రకాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు.

★ షార్ కంట్రోలర్ వీ కుంభకర్ణన్ జారీ చేసిన ఓ సర్క్యులర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, షార్‌లోనూ, సూళ్ళూరు పేట గృహ నిర్మాణ సముదాయాల్లోనూ కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నందువల్ల, ఈ వైరస్ సోకినవారిని, వారికి సమీపంలో సంచరించినవారిని గుర్తించవలసిన అవసరం ఏర్పడింది.

★ వారిని గుర్తించి, ప్రత్యేకంగా చికిత్స అందజేయవలసి ఉంది.

★ కాబట్టి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ముందు జాగ్రత్త కోసం కార్యాలయ ప్రాంగణాల్లో ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించవలసి ఉంది.

★ ఈ చర్యల కోసం షార్ కార్యకలాపాలన్నిటినీ తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించారు.

★ రాకెట్ లాంచ్ స్టేషన్‌లో ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించేందుకు అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే పని చేస్తారని ఈ సర్క్యులర్ పేర్కొంది.

★ అత్యవసర సేవల విభాగం మినహా మిగిలిన ఉద్యోగులంతా ఇళ్ల వద్ద నుంచే పని చేయాలని పేర్కొంది.

★ పులికాట్ నగర్ ఎంప్లాయీస్ కాలనీలో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అష్ట దిగ్బంధనం విధించారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా ప్రభావంతో శ్రీహరికోట ఇస్రో కార్యకలాపాల నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE