న్యూఢిల్లీ:
★ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ నరసాపురం వైకాపా ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు.
★ ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు.
★ గత కొన్ని నెలలుగా తాను వినియోగించే రెండు ఫోన్ నంబర్లను ట్యాప్ చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.
★ కొన్ని రోజులుగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఏవేవో శబ్దాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
★ ఏపీ నిఘా వర్గాలు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21ను ఉల్లంఘించడమేనని రఘు రామకృష్ణ రాజు పేర్కొన్నారు.
★ అంతేకాకుండా తనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.