సిపిఎం ఆధ్వర్యంలో చిలకలూరిపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన
చిలకలూరిపేట: ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు ఆందోళనకు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా చిలకలూరిపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి హామీ పథకాన్ని పెంచాలని, కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు సహాయం అందించి, ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాబు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, జాఫర్, పైరోజు, సిఐటియు రిక్షా కార్మిక సంఘం నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.