728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 17, 2020

ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు: హోంమంత్రి సుచరిత

గుంటూరు: ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతుందన్న చంద్రబాబు మాటలు నిరాధారమని ఏపీ హోమ్ మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై సుచరిత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపైన బురదజల్లే కార్యక్రమాలతో, కుట్రలతో, నిరాధార ఆరోపణలతో, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు.

ఫోన్ టాపింగ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంపైన ఆరోపణలు చేయటం సరికాదని, మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే డిజిపికి అందజేస్తే, విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని.. ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదని, ప్రస్తుతం రాష్ట్రలో నిధుల కొరత ఉన్న, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, ముఖ్యమంత్రి కి ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నదని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు: హోంమంత్రి సుచరిత Rating: 5 Reviewed By: NEWS UPDATE