చిలకలూరిపేట: కరోనా నివారణలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు నెల మొత్తం పనిచేయగా వారి జీతం కటింగ్ చేయడం దారుణమైన చర్య అని AIYF జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని అన్నారు. అలాగే శానిటేషన్ లో వస్తున్న అవినీతి ఆరోపణల మీద, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల మీద విచారణ జరిపి బాద్యులైన వారి మీద తగు చర్యలు తీసుకోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలు చెప్పడానికి పార్టీల నాయకులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసిన ఎత్తరని.. పట్టణంలో నీటి సమస్య ఉన్న పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ తీరుతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు.
August 22, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 'చిలకలూరిపేట మునిసిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలి'
Rating: 5
Reviewed By: NEWS UPDATE

