728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 16, 2020

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం... గుంటలో ఇరుక్కున్న ట్రాక్టర్

చిలకలూరిపేట: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది ఈ సంఘటన. చిలకలూరిపేట పురపాలక సంఘానికి చెందిన అధికారులు పైప్ లైన్ కొరకు రోడ్లను వారి ఇష్టం వచ్చినట్లు పగలగొట్టారు. అయితే పగలగొట్టిన రోడ్ల మీద పైప్ లైన్ వేయకుండా ఉండడం వలన వర్షం ధాటికి ఆ ప్రాంతం బురదమయం కావడం జరిగింది. పట్టణంలోని శారద హైస్కూల్ బజార్లో రోడ్డు పగలగొట్టిన అధికారులు పైపులైను వేయకుండా ఉండడం వల్ల గుంతలు పడి వాహనాలు రోజు కొకటి గుంటల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. అలానే ఈ రోజు కూడా ఒక ఇసుక ట్రాక్టర్ ఆ గుంటలో ఇరుక్కుంది. ట్రాక్టర్ ను బయటకు తీయలేని పరిస్థితిలో ప్రొక్లైనెర్ తెప్పించి మరీ ట్రాక్టర్ ను బయటకు తీయటానికి అరగంట పట్టింది. ఆ సమయంలో ఆ రోడ్డు ట్రాఫిక్ తో నిండిపోవడం వల్ల వాహనదారులు లబోదిబోమన్నారు. చిలకలూరిపేట మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ఇప్పటికైనా అర్థం అవుతుందా అని పలువురు చర్చించుకుంటున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం... గుంటలో ఇరుక్కున్న ట్రాక్టర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE