728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 14, 2020

ప్రధాని మోదీకి రాజధాని రైతుల బహిరంగ లేఖ

అమరావతి:
★ ప్రధాని మోదీకి రాజధాని రైతులు, మహిళలు బహిరంగ లేఖ రాశారు.

★ రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు ఆపేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

★ అలాగే అమరావతిని కాపాడేలా పార్లమెంట్లో ప్రకటన చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

★ ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట రాజధాని రైతులపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది.

★ కుటుంబ అవసరాల కోసం  భూములు అమ్ముకున్నా.. సిట్, సీఐడి, సబ్ కమిటీ పేర్లతో వేధింపులకు గురిచేస్తున్నారు.

★ ప్రభుత్వం రైతులతో న్యాయబద్ధంగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం లేదు.

★ కనీసం అమరావతి హద్దులు కూడా తెలియకుండా నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారు.

★ అమరావతిపై ఆక్రోశం వెళ్లగక్కే నాయకులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి రాజధానిపై బురద చల్లుతున్నారు.

★ జూన్‌ 2, 2014 నుంచి రాజధాని ప్రకటన వరకు అమరావతిలో క్రయవిక్రయాలు జరిగింది 128 ఎకరాలు మాత్రమే.

★ పేద రైతుల పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం జరిపిన విక్రయాలు కూడా ఇన్ సైడ్ ట్రేడింగేనా..?

★ కడపలో ముఖ్యమంత్రి కుమార్తె పేరిట కొన్న భూములు కూడా ఇన్ సైడ్ ట్రేడింగానే భావించాలా..?

★ పేదలకు ఇళ్ల స్థలాల మాటున రాష్ట్రంలో పెద్దఎత్తున వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది.

★ ఈ భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై అవినీతి ముద్ర వేస్తున్నారు అని ప్రధానికి రాసిన లేఖలో రైతులు, మహిళలు అవేదన వ్యక్తం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రధాని మోదీకి రాజధాని రైతుల బహిరంగ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE