చిలకలూరిపేట మునిసిపల్, వైద్య శాఖ అధికారులపై జాయింట్ కలెక్టర్ సీరియస్
చిలకలూరిపేట: పురపాలక సంఘంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, నరసరావుపేట సబ్ కలెక్టర్, డిప్యూటీ వైద్య శాఖ అధికారి కరోనాపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో కరోనా పరీక్షలు ఎన్ని నిర్వహించారు అని మున్సిపల్ అధికారులను, వైద్య ఆరోగ్య శాఖ ANM, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సూపర్వైజర్ లను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. మొత్తం మీద 12,500 పరీక్షలు చేయవలసి ఉండగా.. కేవలం 3వేల పరీక్షలు మాత్రమే ఎలా చేశారని అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కంటైన్మెంట్ జోన్లలో ఇంటింటికి తిరిగి ఆయా ప్రాంతాల్లో వృద్ధులకు, గర్భిణులకు టెస్ట్లు చేయకుండా ఉండటం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. చిలకలూరిపేట పట్టణంలో 50వేల జనాభాకు తక్కువ పరీక్షలు చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 మందికి కరోనా టెస్టులు చేయవలసిందేనని జె.సీ ఆదేశించారు. సక్రమంగా పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని, బాధ్యతగా ఉద్యోగం చేయాలని, కేసులు పెరిగే ప్రాంతంలో అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.