చిలకలూరిపేట: పట్టణంలోని AMG సమీపంలో జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టమోటా లోడుతో వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఆటో డ్రైవరు తాడికొండ మల్లికార్జునరావు(40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ పట్టణంలోని మదర్ తెరిసా కాలనీలో నివాసం ఉంటున్నాడు. పట్టణ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతిచెందిన మల్లికార్జునరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ ఎస్ఐ ఎండి షఫీ తెలియజేశారు.
September 15, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

