చిలకలూరిపేట: కేంద్రంలో బీజేపీ తెచ్చిన కార్మిక సవరణ చట్టాలను నిలిపివేయాలని సిపిఎం దేశవ్యాప్త నిరసనలలో భాగంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు పేరు వెంకటేశ్వర్లు, బాబురావు తదితరులు నిరసన తెలియజేసారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయాలని, విద్యుత్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణల్లో అన్ని రంగాలకు ప్రమాదం పొంచి ఉందని వీరు తెలియజేశారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కోసం బలవంతంగా భూములు తీసుకోకుండా వారికి నష్టపరిహారం చెల్లించాలని వీరు కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిందని, మంచి నీరు, తదితర సమస్యలు ఉన్నాయని వీటిని కూడా వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు అధికారులను కోరారు.
September 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పేట మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసన
Rating: 5
Reviewed By: NEWS UPDATE

