గుంటూరు: నాదెండ్ల ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సోమ్లా నాయక్ శనివారం వరకు సెలవును పొడిగించుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం నరసరావుపేటలో జరిగిన కోవిడ్ సమీక్ష సమావేశంలో కలెక్టర్, డాక్టర్ సోమ్లా నాయక్ మధ్య జరిగిన వాదనలో కలెక్టర్ పై అమర్యాదగా ప్రవర్తించినందుకు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కు మెమో జారీ చేశారు. ఈ విషయం ఆ రోజే సమసిపోయి రాష్ట్రమంతా చర్చకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయినా వైద్యాధికారికి మెమో ఎందుకు జారీ చేయాలని అనేక మంది ప్రభుత్వవైద్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కోవలో డాక్టర్ సోమ్లా నాయక్ శనివారం వరకు సెలవును పొడిగింపు చేసుకున్నారు. ఈ విషయం జిల్లాలో ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.