728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 1, 2020

చిలకలూరిపేట: ‘చేయూత'లో చేతివాటం... ముగ్గురు వాలంటీర్లు తొలగింపు

గుంటూరు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్లలో ముగ్గురు వాలంటీర్ల చేతివాటం ప్రదర్శించారు. నాదెండ్ల పరిధిలోని సచివాలయం 1, 2 లో పనిచేస్తున్న ముగ్గురు వాలంటీర్లు ఎనిమిది మంది వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల తప్పుడు ధ్రువపత్రాలతో జాబితాను తయారు చేసి ఆ ఎనిమిది మంది సంబంధించిన రూ.1.5 లక్షల నగదు తమ బంధువుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి.

బంధువుల ఖాతాల్లోకి నగదు మళ్లించిన వాలంటీర్లు మనోహర్, నాయుడు బాబు, కిషోర్ అనే ముగ్గురి మీద అధికారులకు నాదెండ్ల గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై విచారణ జరిపిన నాదెండ్ల ఎంపీడీవో వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ‘చేయూత'లో చేతివాటం... ముగ్గురు వాలంటీర్లు తొలగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE