728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 24, 2020

చిలకలూరిపేటలో దళిత, క్రైస్తవ సమాధుల తొలగింపు.. ఆందోళనకు దిగిన దళిత నాయకులు

చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారి ఏ.ఎం.జి సమీపంలోని క్రైస్తవ, దళిత స్మశాన వాటికలోని సమాధులను తొలగిస్తున్నారన్న సమాచారం మేరకు దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు భారీగా అక్కడకు చేరుకుని సమాధుల తొలగింపును అడ్డుకున్నారు. పట్టణంలోని దళిత, క్రైస్తవ మృతదేహాలను పూడ్చే అత్యంత పవిత్రమైన స్మశాన వాటికలోని సమాధులు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించడంతో ప్రొక్లైనెర్ డ్రైవరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మున్సిపల్ అధికారులు తొలగించమంటే తాము సమధులను తొలగిస్తున్నామని సంబంధిత డ్రైవర్ చెప్పారు. దీంతో ఆగ్రహించిన దళిత క్రైస్తవులు అనేకమంది స్మశాన వాటిక వద్దకు చేరుకున్నారు. సమాధులను ఎందుకు తొలగిస్తున్నట్లు అని దళిత, క్రైస్తవుల స్మశానవాటిక కూడా వదిలి పెట్టరా అని ప్రశ్నిస్తున్నారు. అయితే దళిత స్మశాన వాటిక స్థలాన్ని అనేకమంది ఆక్రమించుకున్నారని అది కూడా ప్రభుత్వం వెంటనే తేల్చాలని పలువురు దళిత నాయకులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. కాగా, మున్సిపల్ అధికారులు సమాధులను తొలగించి అత్యాధునికంగా విద్యుత్తు స్మశాన వాటికను నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో దళిత, క్రైస్తవ సమాధుల తొలగింపు.. ఆందోళనకు దిగిన దళిత నాయకులు Rating: 5 Reviewed By: NEWS UPDATE