చిలకలూరిపేట: పట్టణ జాతీయ రహదారిపై దళిత క్రైస్తవ సమాదులు తొలగింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారీగా దళిత క్రైస్తవులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడారు. రాస్తారోకో నిర్వహించిన అనంతరం మున్సిపల్ కమిషనర్ వచ్చేంత వరకు తాము ఆందోళన చేస్తామని దళితులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయంపై మున్సిపల్ AE లు వచ్చి తనకేమీ తెలియదని చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ రావాల్సిందేనని దళిత నాయకులు పట్టుబడుతున్నారు.