చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజి పక్కనే ఉన్న 170 సమాధులను మున్సిపల్ అధికారులు పడకొట్టించారు. విషయం తెలుసుకున్న పట్టణ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన దళిత సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనతో ప్రొక్లైనెర్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం జాతీయ రహదారిపై కొంతసేపు దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిచే రాస్తారోకో విరమింప చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రతినిధులు ఏ.ఈ లు అక్కడికి రాగా మీ మాట వినమని, సమాధులను పడగొట్టించిన మున్సిపల్ కమిషనర్ ఇక్కడకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని దళిత నాయకులు అనడంతో అక్కడి నుండి వారు వెళ్ళిపోయారు.
అనంతరం స్మశాన వాటిక ఎదురుగానే టెంటు వేసిన దళిత సంఘాల నాయకులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసనను విరమించేది లేదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నల్లపు కోటి, భక్తవత్సలరావు, పేర్ల శరత్, వెంగల రాయుడు, బుల్లి, ముకిరి కోటి, విజయ్ వినీల్ కుమార్, జ్యోతి బాబు, పిల్లి కోటి, జనసేన నాయకులు రాజరమేష్ తదితరులు పాల్గొని నిరసన దీక్ష చేస్తున్నారు.
