చిలకలూరిపేట: కుక్కలను పట్టి మార్కాపురం అడవుల్లో వదలవలసిన శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నిర్లక్ష్యంగా వాటికి విషపు ఇంజక్షన్ లు ఇచ్చి చంపి డంపింగ్ యార్డ్ లో పడవేసిన విషయంలో జిల్లా కలెక్టర్ కు అందిన ఫిర్యాదు మేరకు మాధ్యమాల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ జరపాల్సిందిగా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపి.. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. వీరి స్థానంలో ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా రమణారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సస్పెన్షన్‌లో ఉంటారు.
September 27, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కుక్కల మృతదేహాలు.. శానిటరి ఇన్స్పెక్టర్ పై వేటు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

