728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 27, 2020

చిలకలూరిపేట డంపింగ్ యార్డ్ లో కుక్కల మృతదేహాల కలకలం

చిలకలూరిపేట: డబ్బులు ఖర్చు పెట్టకుండా.. డబ్బులు మిగిల్చుకోవాలన్న భావంతో.. నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా మున్సిపల్ శానిటరీ అధికారులు చేస్తున్న వైనమిది. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం రాగన్నపాలెం, పాటిమీద, కుక్కలు ఎక్కువయ్యాయని ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుతో మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టి వాటిని వాహనాల్లో మార్కాపురం అడవుల్లో వదిలివేయాలి. ఇది వారు చేయవలసిన పని... కానీ నిబంధనలు గాలికి వదిలేసి వారు ఇష్టం వచ్చినట్లు కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపి, వాటిని చిలకలూరిపేట పట్టణంలోని డంపింగ్ యార్డ్ లో పడేసిన విషయం పట్టణంలో కలకలం రేపింది. గత నాలుగు రోజుల క్రితం చిలకలూరిపేట పట్టణంలో విషపు ఇంజెక్షన్లు ఇచ్చి కుక్కలను ఒక అధికారి ఆధ్వర్యంలో చంపించారు. అయితే వీటిని కెమికల్స్ వేసి పూడ్చాలి, అలా చేయకుండా డంపింగ్ యార్డ్ లో కుప్పలు కుప్పలుగా కుక్కలను మృతదేహాలను పడవేశారు.

ఈ విషయం తెలుసుకున్న హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ వారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కుక్కల పునరుత్పత్తి ఆపాలని వాటికి పునరుత్పత్తి కాకుండా ఇంజక్షన్లు మాత్రమే చేయాలని చెప్పియున్నారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా విషపు ఇంజక్షన్లు ఇచ్చి కుక్కలను చంపటంపై చిలకలూరిపేటలో జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కుక్కలను పట్టి కేవలం అడవుల్లో మాత్రమే వదలాలి అనే నిబంధనలు ఉన్నా ఉత్తర్వులను గాలికొదిలేసి, బిల్లుల కోసం కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి కుక్కలను చంపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరు మొత్తం తెలిసి గుంట తీసి డంపింగ్ యార్డ్ లోనే కుక్కలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపి, కుక్కల మృతదేహాలను డంపింగ్ యార్డ్ లో పడవేసి అనంతరం పూడ్చి వేసిన ఘటనపై జంతు ప్రేమికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట డంపింగ్ యార్డ్ లో కుక్కల మృతదేహాల కలకలం Rating: 5 Reviewed By: NEWS UPDATE