అమరావతి:
★ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రూ.113.11 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
★ జూన్- సెప్టెంబర్ మధ్యకాలంలో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించిన ప్రభుత్వం.
★ కృష్ణా, గోదావరి, కుందూ నదుల వరద ప్రభావంతో 33 శాతానికంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ.
★ విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైయస్‌ఆర్ జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ.
★ నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరపాలని ఆదేశం.
ఉద్యాన పంటలకు రూ.22.59
★ వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలకు రూ.22.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల.
★ మే- సెప్టెంబర్ మధ్యకాలంలో నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు.
★ విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, వైయస్‌ఆర్ జిల్లాల్లో ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ.
★ నేరుగా రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు జరగాలని ఆదేశం.

