728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 8, 2020

ఆ శక్తి ఒక్క విద్యకే ఉంది: హోంమంత్రి సుచరిత

గుంటూరు: ప్రత్తిపాడు జడ్పి పాఠశాలలో హాంమంత్రి సుచరిత, జిల్లా కలెక్టర్ శామ్యుల్ అనంద్ లు జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 మంది విద్యార్థిని, విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేసారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ జగనన్న విద్యా, వైద్యం ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని తీసుకున్న ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమం విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకు వెళుతుందని అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలు బాగుండాలంటే అది ఒక విద్య వల్ల మాత్రమే సాధ్యపడుతుందని.. ఆ శక్తి ఒక విద్యకే ఉందని అన్నారు. విద్యార్థులు అందరూ స్కూల్ కి రావాలని, తల్లితండ్రులు అందరూ పిల్లల్ని స్కూలుకి పంపాలని వారి భవిషత్ కి ముందు బాటలు వేయాలని హోంమంత్రి కోరారు. ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి దాదాపు 650 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అనంతరం ప్రత్తిపాడు మండలం కొండెపాడు గ్రామ స్కూల్ ఆవరణలో గ్రామస్తులకు  తల్లిదండ్రులుకు అవగహన సదస్సు నిర్వహించి.. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్, జిల్లా విద్యశాఖకాధికారి, తహసిల్దార్, ఎంఈఓ, ఎంపీడీవో ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆ శక్తి ఒక్క విద్యకే ఉంది: హోంమంత్రి సుచరిత Rating: 5 Reviewed By: NEWS UPDATE