నాదెండ్ల: ఏపీలో ముస్లిం మైనారిటీల పట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వంకు కనువిప్పు కలగాలని కోరుతూ చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహం నుండి జండా చెట్టు వరకు కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చరు. పోలీసుల వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబీకుల ఆత్మకు శాంతి కలగాలంటే బాధ్యులైన పోలీసు అధికారులను విధుల నుంచి తప్పించి కేస్ ను సీబీఐ కి అప్పగించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఇటీవల వరుసగా దళితుల మీద బీసీ ల మీద ముస్లిం మైనారిటీ ల మీద దాడులు నిర్వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవకుంటే అందరూ కలిసి మీకు సామూహికంగా బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందిని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలు మనుకోకుంటే ప్రభుత్వం వైసీపీ పార్టీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది నీ నాయకులూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనపర్రు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
November 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: జగన్ ప్రభుత్వంకు కనువిప్పు కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ చేసిన టీడీపీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

