చిలకలూరిపేట: గుంటూరు డివిజన్ జనరల్ బాడీ సమావేశం పట్టణంలోని మండల పరిషత్ కార్యలయం వెనుక వైపు ఉన్న విద్యుత్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ గిరిజన విద్యుత్ సంఘం నాయకులు మాట్లాడుతూ... విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులకు భద్రత ఉండదని, ప్రభుత్వాలు దీనిపైన పునరాలోచన చేయాలన్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ రంగంలో జరుగుతున్న 33/11 కె.వి షిఫ్ట్ ఆపరేటర్ లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపైన ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గిరిజనులకు న్యాయం చేయాలని కోరామన్నారు. ఏపీసిపిడిసిఎల్ ను కాపాడవలసిన బాధ్యత ఉద్యోగుల పైన ఉందన్నారు. వినియోగదారులకు సేవలు చేయవలసిన బాధ్యత మనపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన విద్యుత్ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి బి.బాలు నాయక్, డివిజన్ అధ్యక్షలు ఏ.శివనాయక్ కార్యదర్శులు బి.రవింద్ర, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
November 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 'విద్యుత్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి'
Rating: 5
Reviewed By: NEWS UPDATE

