చిలకలూరిపేట పట్టణంలో జాతీయ రహదారిపై పలు కూడళ్లలో వాహనచోదకులు వివిధ అవసరాల కోసం జాతీయ రహదారిపై వారి వాహనాలను ఆపి అల్పాహారం కోసం, భోజనాల కోసం ఆపు చున్నారని ఈ కారణం చేత కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కనుక జాతీయ రహదారి పైన వాహనాలు ఆపకుండా చూసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలో వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు పై జీబ్రా గీతలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని కనుక స్పీడ్ బ్రేకర్లు పై జిబ్రా గీతలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వీస్ రోడ్లు అందుబాటులో ఉండే విధంగా మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను కోరారు.
త్వరలో శాసనసభ సభ్యురాలు విడుదల రజిని నీ కలసి సమస్యలను వారి దృష్టికి కూడా తీసుకొని వెళతామని లోక్ సత్తా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా నాయకులు మురికిపూడి ప్రసాద్, హరి ప్రసాద్, కృష్ణ ప్రసాద్, సాంబయ్య, వెంకటేశ్వరరావు, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

