చిలకలూరిపేట: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ చిలకలూరిపేటలోని 52 ఎకరాలలో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి అని అన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా నవంబర్ 16వ తేదీన లబ్ధిదారులచేత గృహప్రవేశాలు చేయించే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అలాగే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ళు ఇస్తామని వాలంటైర్ల ద్వారా చేస్తున్న ప్రచారాన్ని హర్షిస్తున్నాము. టిడ్కో లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం టిడ్కో లబ్ధిదారులకు చెల్లిచాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్, ఏరియా కార్యదర్శి cr మోహన్, కామ్రేడ్ సుభాని, సుబ్బాయమ్మ, చేరుకుపల్లి నిర్మల నసార్, నాగేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
November 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: టిడ్కో ఇళ్లను సందర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

