చిలకలూరిపేట:వైఎస్ఆర్సిపి విజయోత్సవ సభ చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ లో జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు ఆలీ,ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, విడదల రజని, మేయర్ కావటి మనోహర్ నాయుడు వైయస్సార్ సిపి నాయకులు విడుదల కుమారస్వామి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ నటుడు ఆలీ మాట్లాడుతూ వైయస్సార్ సిపి పార్టీ లో ఎమ్మెల్యే విడదల రజిని చిలకలూరిపేట సూపర్ స్టార్ మహిళ అన్నారు. ఇంకా కొద్ది సంవత్సరాలు ఈమె ఎమ్మెల్యేగా గెలుపొందుతారన్నారు. అమెరికా నుంచి వచ్చి ప్రజా సేవ చేయడానికి చిలకలూరిపేటలో ఫౌండేషన్ ద్వారా సేవలు అందించి ఎమ్మెల్యే అయ్యారని అలీ అన్నారు. తాను తన తండ్రి పేరిట ఫౌండేషన్ను స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. ఈరోజు యాంకర్ గా అవార్డు తీసుకోవాల్సి ఉండగా ఈ ఊరు వచ్చాననని అన్నారు. చిలకలూరిపేటలో ఒక ముస్లిం సాధారణ వ్యక్తికి చైర్మన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ చిలకలూరిపేట లో కరోనా వచ్చినప్పుడు మాజీమంత్రి ఐసీయూలో ఉన్నారని, కరోనా టీకా వచ్చిన తదనంతరం మాత్రమే చిలకలూరిపేట కు వచ్చారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందూతనని, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిత్తుగా ఓడి పోతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్ తనదేనని తాను చేసే అభివృద్ధి తనను గెలిపిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభలో వైఎస్ఆర్ సీపీ నాయకులు యార్డుచైర్మన్, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు తదితరులు
పాల్గొన్నారు..


