728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 22, 2021

య‌డ్ల‌పాడులో ప్ర‌పంచ నీటి దినోత్స‌వంలో పాల్గొన్న ఎమ్మెల్యే, జె.సి.


 ఎడ్లపాడు:జ‌ల‌సంర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త అని, అది ఉద్య‌మంలా సాగాల‌ని, నీటిని నిల్వ చేసుకునేందుకు ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి ప్ర‌జ‌ల స‌హ‌కారం కూడా కావాలని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని ఆకాంక్షించారు. మండ‌ల కేంద్రం య‌డ్ల‌పాడులో ప్ర‌పంచ నీటి దినోత్స‌వం సంద‌ర్భంగా సోమవారం కేంద్ర ప్ర‌భుత్వ జ‌ల‌శ‌క్తి అభ‌యాన్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి జ‌ల్లా స్థాయి అధికారులంతా హాజ‌ర‌య్యారు. జేసీ ప్ర‌శాంతి, డ్వామా పీడీ శ్రీనివాస‌రెడ్డి, జెడ్పీ సీఈవో చైత‌న్య‌, జిల్లా పంచాయ‌తీ అధికారి కేశ‌వ‌రెడ్డి త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ స‌క‌ల మాన‌వాళికి జ‌ల‌మే ఆధార‌మ‌ని చెప్పారు. విశ్వంలోని ప్ర‌తి జీవి మ‌నుగ‌డ నీటి వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతోంద‌ని చెప్పారు. అయితే జ‌ల సంర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతుండ‌టం వ‌ల్ల ఇప్పుడు మాన‌వాళికి నీటి ముప్పు పొంచి ఉంద‌ని తెలిపారు. రుతుప‌వ‌నాలు చురుకుగా లేక‌పోతుండ‌టం, ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు, జ‌ల‌సంర‌క్ష‌ణ‌పై మాన‌వుల్లో నిర్ల‌క్ష్యం.. లాంటి ఎన్నో కార‌ణాల వ‌ల్ల క‌రువు ప‌రిస్థితులు వాటిల్లుతున్నాయ‌ని వెల్ల‌డించారు. వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లో ప్ర‌పంచంలోని స‌గం ప్రాంతాల్లో బావులు, చెరువులు ఎండిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. గుక్కెడు మంచినీటి కోసం మ‌హిళ‌లు కిలోమీట‌ర్ల కొద్ది బిందెలు మోసుకెళ్లాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ భ‌విష్య‌త్తులో నీటి స‌మ‌స్య మ‌రింత‌గా పెరిగిపోకుండా చేసేందుకే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కృషి చేస్తున్నాయ‌ని తెలిపారు. రెండు ప్ర‌భుత్వాల‌ భాగ‌స్వామ్యంతో 2019వ సంవత్స‌రం నుంచి జ‌ల‌శ‌క్తి అభ‌యాన్ కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టారని చెప్పారు. నీటి ల‌భ్య‌త త‌గ్గుతున్న ఈ త‌రుణంలో ఉన్న నీటి వ‌న‌రుల‌ను వినియోగించుకుని జ‌ల‌వ‌న‌రుల అభివృద్ధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశమ‌ని పేర్కొన్నారు. దీని కోసం మ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ చొర‌వ తీసుకుని చెరువుల‌ను అభివృద్ధి చేయ‌డం, భూ గ‌ర్భ నీటి వ‌న‌రుల ల‌భ్య‌త‌ను పెంచ‌డం, ప్ర‌జ‌లందరికీ సుర‌క్షిత మంచినీటిని అందించ‌డం లాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. ప్రతి వర్షపునీటి బొట్టును ఒడిసి ప‌ట్ట‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎలా వినియోగించుకోవాలి..? సమర్థవంతమైన నీటి పొదుపు ప్రణాళికలు ఏంటి... త‌దిత‌ర వివ‌రాల‌ను జ‌ల‌శ‌క్తి అభ‌యాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా అధికారులు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా సంప్రదాయ నీటి వనరులైన చెరువులు, బావులు, వాగులను పున‌రుద్ధ‌రిస్తార‌ని పేర్కొన్నారు. వాట‌ర్‌షెడ్‌ల‌ను అభివృద్ధి చేస్తారని చెప్పారు. జేసీ ప్ర‌శాంతి మాట్లాడుతూ ముఖ్యంగా అభివృద్ధి పేరుతో అడ‌వుల‌ను ఇష్టారాజ్యంగా మాన‌వులు నాశ‌నం చేస్తున్నార‌ని తెలిపారు. దీనివ‌ల్ల ఉష్ణోగ్ర‌త‌ల్లో మార్పులు జ‌రిగి రుతుప‌వ‌నాలు గ‌తి త‌ప్పుతున్నాయ‌న్నారు. ఈ జల సంక్షోభానికి ముఖ్యకారణం నేటి నాగరిక మానవుడు అవలంబిస్తున్న నీటి వినియోగ పద్ధతులే అని చెప్పారు. ప్ర‌జ‌లంతా నీటి సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో తహశీల్దార్  శ్రీనివాసరావు, ఎంపీడీఓ మాధురి,నియోజకవర్గ బూత్ కన్వీనర్ విడదల గోపి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యఘ్నేశ్వర రెడ్డి,ఎడ్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు కల్లూరి బుజ్జి,జడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు,ఎడ్లపాడు మండల సర్పంచ్ కారుచోళ హేమ,గ్రామ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సుభాని,ఎడ్లపాడు మండల యస్.సి సెల్ అధ్యక్షుడు పందుల బుల్లెబ్బాయి,ఎడ్లపాడు మండల బీసీ సెల్ అధ్యక్షుడు పల్లపు ముసలయ్య, సాగర్,కర్నాటి సుబ్బారావు, మాదం శ్రీనివాసరావు,మద్దూరి భాస్కరరెడ్డి, మానుకొండ విజయభాస్కర్ రెడ్డి,గౌరి హనుమంతరావు, కరిముల్లా మరియు పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: య‌డ్ల‌పాడులో ప్ర‌పంచ నీటి దినోత్స‌వంలో పాల్గొన్న ఎమ్మెల్యే, జె.సి. Rating: 5 Reviewed By: NEWS UPDATE