728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2021

చిలకలూరిపేటలో నేటి నుండి లాక్ డౌన్

చిలకలూరిపేట: మునిసిపాలిటి మరియు చిలకలూరిపేట మండలములో ఉన్న గ్రామములలో కరోనా కేసుల ఉదృతి ఎక్కువగా ఉండుట వలన, వాటి నివారణ చర్యలలో బాగముగా, చిలకలూరిపేట మండలములోని వివిధ వ్యాపార, వినోద సంబందిత కార్యక్రమముల సమయములను ది.21.4.21 బుధవారం నుండి ఈ క్రింది విధముగా తగ్గించుచూ మధ్యాన్నం 1.00 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఇన్సిడెంట్ కమాండర్ చిలకలూరిపేట తహసిల్దార్ సుజాత ఉత్తర్వులు జారీ చేసారు. 

1. చిలకలూరిపేట మునిసిపాలిటి మరియు చిలకలూరిపేట మండలములో ఉన్న గ్రామములలో ఉ.గం 6.00ల నుండి మధ్యాన్నం 1.00 వరకు మాత్రమే అన్ని రకముల వ్యాపార సముదాయములు తెరవవలేనని తెలియజేశారు.

2. రెస్టారెంట్లు మరియు హోటల్స" లలో కేవలము పార్సిల్స్" వరకు మాత్రమే
అనుమతించారు. టీ స్టాల్స్ ను అనుమతి రద్దు పరిచారు.

3. చిలకలూరిపేట పట్టణ మరియు గ్రామములలో జరుగు తిరునాళ్ళు, జాతరలు మొదలుగు వాటియందు గ్రామస్తులు ఎవరు పాల్గొనకూడదని తెలిపారు. ఆలయ పూజారులు మరియు గుడి పెద్దలు మాత్రము కొవిడ్ నిబంధనలు పాటించుచూ సదరు కార్యక్రమములు జరుపుకోనవలెననీ, మరియు బుధవారం జరుగు శ్రీరామనవమి పండుగను ఎవరి ఇండ్ల యందు వారే జరుపుకోవలను మరియు మసీదు మరియు చర్చిల యందు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రార్థనలను చేసుకోవలసినదిగా తహసీల్దారు తెలియచేశారు.

4. పోలిస్, మునిసిపాలిటి మరియు గ్రామ పంచాయతీలు, వారి వారి పరిధిలో ప్రజలందరూ మాస్క'లు దరించునట్లు చూడవలెను. అట్లు మాస్క' దరించని వారికి Rs.100/- పెనాల్టీ విదించి, ప్రతిరోజూ ఎంత మందికి పెనాల్టి విదించారో, ఆ వివరములు ఈ క్రింది. సంతకముదారుకు ప్రతిదినము నివేదిక ఇవ్వవలయునని మరియు అత్యవసర సర్వీస్ లకు అనగా మెడిసిన్ కు సంబందించిన దుకాణములు తప్ప ఇతర దుకాణములు మద్యాన్నం 
మూసివేయబడునట్లు తగు చర్యలు తీసుకొనవలసిందిగా ఆదేశించారు. తోపుడు బండ్లు ఒకచోట ఉండకుండా, తగు చర్యలు పాటించేటట్లు చూడవలెనని తెలిపారు.

5.పాల దుకాణములు, కూరగాయల దుకాణములు, చికిన్, మటన్ దుకాణములు మరియు ఇతర దుకాణదారులు తమ దుకాణములకు వచ్చువారు. సామాజక దూరం పాటించేటట్లు తగు ఏర్పాట్లు చేయవలెను. మాస్క' ధరించిన వారిలో మాత్రమే క్రయ, విక్రయాలు జరపాలన్నారు.

6. వివాహములు మరియు ఇతర కార్యక్రమములు చేయు వారు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకొనవలను. నిబంధనలు సంబంధిత శాఖ అధికారులందరూ తప్పక అమలు అగునట్లు చూడవలయును. ఇందుకు తప్పరాదు. పై నిబంధనలు ది.21.04.2021 నుండి తదుపరి ఉత్తర్వుల వరకు అమలులో ఉండును. ఈ నిబంధనలు పాటించని వారిపై అండర్ సెక్షన్ ఐ.పి.సి. 188 చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియపరిచారు. ఇందుకు సంబందించి కమిషనర్ చిలకలూరిపేట పురపాలక సంఘం వారు తగు చర్యలు తీసుకొనవలెనని తెలియచేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు చిలకలూరిపేట అర్బన్ మరియు రూరల్ వారు పై నిబందనలను పటిష్టంగా అమలు చేయవలెనని ఉత్తర్వులల్లో తెలియజేసారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేటి నుండి లాక్ డౌన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE