ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమేఖ్య రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ గా గంగరాజు యశ్వంత్ సాయికృష్ణ ను రాష్ట్ర అద్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ , మరియు కోశాధికారి అడవి వెంకట కృష్ణ నియమించారు. రాష్ట్రంలో ఉన్న13 జిల్లాలో రాబోయే రోజుల్లో సమాఖ్య అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసే విధంగా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రచారాలు జరిగిన సమయంలో వాటిని బాహ్య సమాజానికి తెలియజేసేందుకు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ తెలిపారు. ముందు రోజుల్లో మరింతగా సమాఖ్య బలపడే విధంగా పనిచేయాలని, దానికి సమాఖ్య రాష్ట్ర నాయకత్వం వెన్నంటే ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా నియమించిన సాయికృష్ణ మాట్లాడుతూ నన్ను ఈ పదవిలో నియమించిన మన రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్కు, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ కు, కోశాధికారి అడవి కృష్ణా కు అదేవిధంగా నాకు ఈ పదవికి సహాకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా అన్న తోలేటి రవీంద్ర కు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ సమాఖ్య కార్యక్రమంలో మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు నావంతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నియమకానికి సహాకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసారు.

