చిలకలూరిపేట: మంగళవారం నుండి కరోనా దృష్ట్యా కఠిన ఆంక్షలు అమలులోకి రానున్నాయి. పట్టణ, మండల పరిధిలోని కళ్యాణ మండపాలు, వివిధ ఫంక్షన్ హాల్స్ మూసివేయాలని ఇన్సిడెంట్ కమాండర్ సుజాత ఉత్తర్వులు జారీ చేశారు. అలానే సినిమా థియేటర్లలో 50 శాతం మాత్రమే టికెట్లు విక్రయించి కరోనా నియమ నిబంధనల ప్రకారం మాత్రమే థియేటర్లో ప్రేక్షకులను అనుమతించాలని తెలియజేశారు. టీ కోట్లు మూసి వేయాలని జనం రద్దీగా లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. మాస్కు ధరించని వారికి అపరాధ రుసుము విధిస్తున్నట్లు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాల్సిందే నని కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణం లోని వాణిజ్య వర్తక షాపు నిర్వాహకులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు నిర్వహించి 6 తరవాత షాపులు మూసివేయనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తెలిపి ఉన్నారు. అలానే మార్కెట్ ను తరలించి గత సంవత్సరం కరోనా సమయంలో ఏ విధంగా ఆంక్షలు ఉన్నాయో ఆ విధంగా ఆంక్షలు అమలు చేస్తామని మున్సిపల్ చైర్మన్ రఫాని సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ఈ విధంగా చూస్తే చిలకలూరిపేటలో కరోనా దృష్ట్యా మంగళవారం నుండి కఠినంగా ఆంక్షలు అధికారులు అమలుచేయనున్నారు..
April 20, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నేటి నుండి చిలకలూరిపేటలో కరోనా దృష్ట్యా కఠిన ఆంక్షలు అమలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

