చిలకలూరిపేట: ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి మాస్క్ను వాడాలని మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ కరోనా ని తరిమికొట్టాలని వ్యాపార వర్గాలు కరోనా నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. కూరగాయల మార్కెట్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని... అధికారులు మాస్క్ లేని వారిపై చర్యలు చేపడతామన్నారు. ఫంక్షన్ హాల్ ఇప్పటికే ప్రభుత్వం మూసేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో శానిటేషన్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే విడదల రజిని జిల్లా వైద్య అధికారులతో మాట్లాడి ఎక్కువ కోవిడ్ టెస్ట్ లు చేసేలా కోరారని టీకా ఎక్కువగా చిలకలూరిపేట పంపాలని కోరినట్లు చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్ అంజమం కమిటీ కార్యదర్శి తదితరులు ఉన్నారు...
April 19, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కరోనా పెరగకుండా కఠిన చర్యలు: మున్సిపల్ చైర్మన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

