చిలకలూరిపేట: స్థానిక పురుషోత్తమ పట్టణంలోని తన నివాసంలో శాసనసభ్యురాలు విడదల రజిని జిల్లా అటవీ అధికారి యన్. రామచంద్రరావు తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా గత సంవత్సరం జరిగిన అభివృద్ధి పనులు,ఈ సంవత్సరం జరగవలసిన కొండవీడు అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన వివరాలను డీఎఫ్ వో ద్వారా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో మూడు.. నాలుగు నెలల్లో పిల్లల పార్కు, అడ్వంచెర్ పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాబోవు జూన్ మాసం నుండి కొండ పైన పెద్ద ఎత్తున మొక్కలు నాటవల్సిందిగా సూచించారు. ప్రభుత్వం నుంచి కొండవీడు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా డీఎఫ్వో యన్. రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా నేపద్యంలో కొండపైకి పర్యాటకులకు అనుమతివట్లేదు అని పర్యాటకులు కోవిడ్ ఉధృతి తగ్గి కొండపైకి వెళ్ళేసరికి మౌలిక వసతులైన త్రాగునీరు, టాయిలెట్స్ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు.. పార్కింగ్ ఏరియా అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. బురుజుల నిర్మాణం పూర్తయిందన్నారు. చెరువులను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పెద్ద ఎత్తున ప్లానిటేషన్ చేపట్టినట్లు చెప్పారు. శాసనసభ్యురాలు విడదల రజిని సహకారంతో అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేస్తామని తెలిపారు.

