చిలకలూరిపేటలో పేకాట స్థావరాలపై దాడులు... 13 లక్షల పైగా స్వాధీనం... పూర్తి వివరాలు వెల్లడించిన DSP
చిలకలూరిపేట: పట్టణంలోని పండరీపురం 10వ లైన్ లో ఒక అపార్ట్ మెంట్ లో భారీ ఎత్తున టేబుల్ వేసి టేబుల్ కు 12 మంది చొప్పున పేకాట ఆడుతున్న స్థావరాలపై గుంటూరు జిల్లా ప్రత్యేక బృందం, చిలకలూరిపేట పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఈ పేకాట ఆడుతున్న, నిర్వహకులైన 33 మంది వ్యక్తులను... వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, నగదు టోకెన్లు, 13,37000/- నగదు స్వాధీనం చేసుకొని వారిని చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నర్సారావుపేట డిఎస్పీ విజయ భాస్కరరావు మాట్లాడుతూ పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేస్తామని.. మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట చెందినవారు కాగా పేకాట ఆడుతున్న ప్రధాన నిర్వాహకులు ఇద్దరీని అరెస్ట్ చేసామనన్నారు. పేకాట నిర్వహిస్తున్న ఇరువురుతో పాటు మొత్తం 33 మందిని అరెస్ట్ చేసినట్లు మీడియాకు డీఎస్పీ తెలియజేశారు.