728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 9, 2021

ఎడవల్లి దళితుల భూములు లాక్కుంటే న్యాయ పోరాటం చేస్తాం

చిలకలూరిపేట: మండల ఎడవల్లి వీకర్ సెక్షన్ కాలోనైజేషన్ సొసైటీ సమావేశం మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మల్లికార్జున్ రావు నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 20 మంది రైతులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం రైతులు తహసీల్దార్ కార్యాలయం బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రైతులు మాట్లాడుతూ తమ సొసైటీని పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించాలని తాము కోరామన్నారు. 120 మంది సభ్యులు ఉన్న సొసైటీలో సమావేశాన్ని బహిరంగంగా తమ గ్రామంలో నిర్వహించాలని రైతులు తాసిల్దార్ ను కోరినట్లు సొసైటీ సభ్యుడు రాంబాబు మీడియాకు వివరించారు. అయితే తాసిల్దార్ మాత్రం ఆ భూముల్లో నిక్షేపాలు ఉన్నాయని... ఒక ఎకరానికి నాలుగు లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇచ్చి... ఎక్కడైనా పొలం పట్టా అందజేస్తామని తెలిపారన్నారు. ఈ విషయంపై తాము నిరసన వ్యక్తం బయటకు వచ్చామని తెలియజేశారు. తమ పొలాలకు తమకు నష్టపరిహారం ఇచ్చేది ఏమిటని వారు ప్రశ్నించారు. తమ పొలాలను కొంతమంది లాక్కోవాలని చూస్తున్నారని ఈ విషయంపై తాము న్యాయ పోరాటానికైనా సిద్ధమని దళిత రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎడవల్లి దళితుల భూములు లాక్కుంటే న్యాయ పోరాటం చేస్తాం Rating: 5 Reviewed By: NEWS UPDATE