728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2021

స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాలా?: జగన్​కు లేఖలో రఘురామ

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తన పేరును తొలగించడంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్​కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. తిరుపతి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ గురుమూర్తి పేరును కూడా పొందుపరచి... తన పేరును తొలగించడంపై ఎంపీ రఘురామ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా పొరపాటున తొలగించి ఉంటే ఆ పొరపాటును 48 గంటల్లో సరిచేసి... అందుకు బాధ్యలపై చర్య తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ కావాలనే తొలగించిన పక్షంలో తనను పార్టీ నుంచి బహిష్కరించారని భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ సెక్రటేరియట్ కు తెలియపరచి తనను తాను స్వతంత్ర అభ్యర్ధిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని రఘురామ తేల్చి చెప్పారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాలా?: జగన్​కు లేఖలో రఘురామ Rating: 5 Reviewed By: NEWS UPDATE