728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 13, 2021

జ‌గ‌న‌న్న పాల‌న‌లో పేద‌ల‌కు ఏ క‌ష్టం రాదు: ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: ముఖ్య‌మంత్రి స‌హానిధి పేద‌ల‌కు పెన్నిధిలాంటిద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. స్థానిక న‌ర‌స‌రావుపేట సెంట‌ర్‌లోని త‌న కార్యాల‌యంలో ఆదివారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను పంపిణీ చేశారు. తుర్ల‌పాడుకు చెందిన వై.మార్త‌మ్మ‌కు రూ.65వేలు,నాదెండ్లకు చెందిన బి.సాయిల‌క్ష్మికి రూ.60 వేలు, లింగంగుంట్ల కు చెందిన జి.కృష్ణ‌మూర్తికి రూ.45వేలు, కావూరుకు చెందిన ర‌మావ‌త్ ల‌క్ష్మీనాయ‌క్‌కు రూ.45వేలు చొప్పున ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక సాయం వ‌చ్చింది. ఇలా నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 203 మందికి రూ.36.25 ల‌క్ష‌ల విలువైన చెక్కులు రాగా.. ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని కొంతమంది ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అంద‌జేశారు మిగిలిన చెక్కులు మా నాయకులే ఇంటి ఇంటికి వచ్చి అందచేస్తారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యం కోసం గ‌తంలోలాగా... ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే ప‌రిస్థితి లేకుండా చేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ పాల‌న‌లో దాదాపు అన్ని రోగాల‌కు పేద‌ల‌కు ఉచితంగా కొర్పొరేట్ ఆస్ప‌త్రుల్లో వైద్య స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. క‌రోనాను ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని చెప్పారు. దేశంలో మ‌రెక్క‌డా లేని విధంగా క‌రోనాకు ఉచితంగా వైద్యం అందేలా చేసిన ఘ‌న‌త త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని వెల్ల‌డించారు. జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రిగా ఉన్నన్నాళ్లు పేద‌ల‌కు ఏ క‌ష్టం రాద‌ని తెలిపారు. ప్ర‌తి స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకుని ప‌రిష్క‌రిస్తుంద‌ని చెప్పారు. కార్య‌క్ర‌మంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి, పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, కౌన్సిలర్లు విడదల గోపి,బేరింగ్ మౌలాలి, అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, జాలాది సుబ్బారావు పార్టీ నాయకులు కాట్రగడ్డ మస్తాన్ రావు, వేణు, అంకమ్మరావు నకిరికంటి శ్రీకాంత్, పావులూరి వాసు, మంగు ఏడుకొండలు, నాగభైరు వెంకట్, ఆరుమల్ల వెంకటశివ, లింగంగుంట్ల చినబాబు, మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జ‌గ‌న‌న్న పాల‌న‌లో పేద‌ల‌కు ఏ క‌ష్టం రాదు: ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE