చిలకలూరిపేట: మండల తాసిల్దార్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జున రావు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణ, మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలియజేశారు. అందువల్ల పట్టణ మరియు మండలంలో మంగళవారం నుండి ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం చేసుకోవాలని రెండు గంటల అనంతరం పట్టణం మరియు మండలంలో కర్ఫ్యూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6:00 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. జనం ఎవరైనా బయట తిరిగితే 500 రూపాయలు జరిమానా విధించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. హోటల్లు నిర్వహించే వారు రెండు గంటల అనంతరం పార్సిల్స్ మాత్రమే అనుమతి ఉందని తెలియజేశారు. రెండు గంటల అనంతరం ఆర్టీసీ డిపో వారు బస్సులను తిప్పకూడదని... ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. జనం ఎవరూ బయట తిరగవద్దు అని... ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయన కోరారు. ఎవరికైనా కరోనా వస్తే ఈ విషయాన్ని 104కు సమాచారం అందించాలని... లేదా వార్డు సచివాలయాల్లో ని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చి కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం పొందాలని తహసిల్దార్ మల్లికార్జునరావు తెలియజేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తాసిల్దార్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, నోడల్ అధికారి గోపీనాయక్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరావు, ఎంపీడీవో హేమలత, ఎస్సై నరసదాసు తదితరులు పాల్గొన్నారు.
July 5, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో రేపటి నుండి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

