728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 10, 2021

కరోనా బాధిత కుటుంబాలకు 2లక్షల విలువచేసే నిత్యావసరాలు అందజేసిన అసిస్ట్ సంస్థ

చిలకలూరిపేట: అసిస్ట్ సంస్థ కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో తమ వంతు పాత్ర పోషిస్తుందని అసిస్ట్ డైరెక్టర్ జాస్టి రంగారావు అన్నారు. పట్టణంలోని అసిస్ట్ ప్రధాన కార్యాలయంలో 16 గ్రామాలకు చెందిన 100 మంది కరోనా బాధిత కుటుంబాల వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఒక్కోక కుటుంబానికి 10 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, గోధుమపిండి, నూనె, సబ్బులు చొప్పున అసిస్ట్ డైరెక్టర్ రంగారావు చేతుల మీదగా అందజేశారు. మొత్తం రెండు లక్షల రూపాయల విలువ చేసే సరుకులను కరోనా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ డైరెక్టర్ రంగారావు, ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున ప్రమీల, విజయలక్ష్మి, రమాదేవి, అసిస్ట్ అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్, విష్ణుప్రియ, సూర్యనారాయణ, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా బాధిత కుటుంబాలకు 2లక్షల విలువచేసే నిత్యావసరాలు అందజేసిన అసిస్ట్ సంస్థ Rating: 5 Reviewed By: NEWS UPDATE