728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2021

జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు

చిలకలూరిపేట: పట్టణంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్.కృష్ణయ్య కి స్వాగతం పలికిన విడదల గోపి. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఇంతలాగా ఆదరించిన చిలకలూరిపేట వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం అని అన్నారు, విద్యార్థి దశ నుంచే పిల్లలను తీర్చిదిద్దాలి అని అమ్మఒడి పధకం ప్రవేశపెట్టి,అంతటితో ఆగకుండా నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖల మార్చి పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా ఈ పథకాల్ని అమలు చేయటానికి ప్రణాళికలు చేస్తున్నాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు జగన్ పరిపాలన,అలానే సంక్షేమ పధకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు, ఏకంగా 56 బీసీ కార్పొరేషన్ లు పెట్టి వాటికి 56 మంది చైర్మన్లగా నియమించి ఆయా కులాల అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి మా బీసీ లు అందరికి తరుపున ధన్యవాదాలు,అలానే ఇక్కడ చూసుకుంటే ఒక యస్.సి కి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు,ఒక మైనారిటీ కి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్యే విడదల రజిని బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్దపీట వేస్తున్నారో,ఇటువంటి నాయకత్వం మన బీసీ లు అందరూ అలవర్చుకోవాలి అని,ఇక్కడ ఎమ్మెల్యే రజిని ని అందరూ వాళ్ళ ఇంటిబిడ్డ లాగా భావించటం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం సంచారజాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,పట్టణ అధ్యక్షులు పఠాన్ తలహ ఖాన్,ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, కౌన్సిలర్లు బిట్రా రాజేంద్ర,చెంబేటి భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,యూసుబ్ అలీ,నాయబ్ సైదాబీ,మూలకలూరి బాజీ మున్ని,మరియు నాయకులు నకిరికంటి శ్రీకాంత్,కొణిదెన కోటేశ్వరరావు,కొండవీటి ఆంజనేయులు,నాయుడు వాసు,నామపల్లి రాము,రమేష్,,తుమ్మల నాగరాజు,గుడికందుల శ్రీను,తెల్లబాటి వినయ్,అట్లూరి శ్రీను,కొండ్రముట్ల నాగేశ్వరరావు,రాచపూడి వెంకట్,క్షత్రియ బాబీ సింగ్,గుంజి పద్మావతి,బండారు కోటేశ్వరమ్మ,కాకుమాను సరోజినీ,యలగాల రామాంజి,గోపిదేశి రాజశేఖర్, అలిమియా ,వేటపాలెం సుభాని,తోట బ్రహ్మాస్వాములు,మోషే,పొన్నం చంద్రశేఖర్,నాగబైరు వెంకట్,మద్దూరి భాస్కర్ రెడ్డి,అక్బర్,చోటు,సుదర్శనం వెంకయ్య,తన్నీరు కోటేశ్వరరావు,పోలిశెట్టి మస్తాన్,విడదల కమలేంద్ర మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జగన్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు Rating: 5 Reviewed By: NEWS UPDATE