చిలకలూరిపేట: యడ్లపాడు మండలంలో మూడు గ్రామలు కంటైన్మెంట్ జోన్లు. కోవిడ్ కేసులు అధికంగా వెలుగు చూసిన మూడు గ్రామాలను మండల టాస్క్ఫోర్స్ కమిటీ కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం మూడు గ్రామాలలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే కర్ఫ్యునూ సడలించింది. మిగిలిన గ్రామాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఉంది. మూడు గ్రామాల ప్రజలు బయటకు రావద్దని... గుంపులుగా చేరవద్దంటూ అధికారులు హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో దుకాణాలు తెరిచినా... వ్యాపారాలు కొనసాగించినా రూ.1000, అలాగే మాస్కు లేకుండా తిరిగి వారికి రూ.100 జరిమాన విధించనున్నట్లు మండల టాక్స్ఫోర్స్ కమాండర్ జె శ్రీనివాసరావు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ మహిళా పోలీసు, ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య, పారిశుధ్య, కోవిడ్ నిబంధనల అమలుకై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
July 2, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మరో మూడు గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

