న్యూఢిల్లీ:
★ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందన
★ సునీల్ కుమార్ వ్యవహారంపై వచ్చిన 3 ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
★ ఫిర్యాదులు పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకోవాలని హోంశాఖ ఆదేశం
★ తీసుకున్న చర్యల వివరాలపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
★ సివిల్ సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో సునీల్ పై రఘురామ ఫిర్యాదు
★ ఐపీఎస్ హోదాలో సమాజంలో అలజడి సృష్టించేలా మాట్లాడారని ఫిర్యాదు
★ రఘురామ ఫిర్యాదు, సునీల్ ప్రసంగ వీడియోలను రాష్ట్రానికి పంపిన కేంద్ర హోంశాఖ
★ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు కేంద్ర హోంశాఖ ఆదేశం
★ ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో తమకు చెప్పాలని ఆదేశం
★ సునీల్ మత వ్యతిరేక ప్రచారం చేశారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్జర్వేటరీ ఫిర్యాదు

