చిలకలూరిపేట: యడ్లపాడు మండలంలోని యడ్లపాడు, కొండవీడు, కొత్తపాలెం, లింగారావుపాలెం గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా కొవిడ్ ఇన్సిడెంట్ కమాండర్, తహసీల్దార్ జె శ్రీనివాసరావు ప్రకటించారు. మండలంలోని వంకాయలపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం గ్రామాలలో కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ తహసీల్దార్ నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన గ్రామాల సంఖ్య ఏడుకు కు చేరింది. ఆయా గ్రామాలలో అత్యవసర పనులు మినహా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావద్దని సూచించారు. వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 6:00 గంటల నుంచి 11:00 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని సూచించారు.
July 3, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మరో నాలుగు గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

