చిలకలూరిపేట: పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో ఆస్తి తగాదా విషయంలో మామా అల్లుళ్ళ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మామ మృతి చెందగా... అల్లుడుకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని 108 అంబులెన్స్ లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ సుభాని కాలనీలోని స్థలానికి సంబంధించిన విషయంలో బావమరిది షేక్ జానీ భాషా ల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడగా మధ్యలో అడ్డు వచ్చిన జాని భాష తండ్రి, సుభాని మామ షేక్ సుభాని(68) అడ్డు వెళ్ళాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన సుభాని(68) మృతి చెందాడు. సుభాని అతని బావమరిది జానీ భాషలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈ.ఎన్.టి శోభన్ బాబు పైలెట్ శివ నాగ ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
July 5, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మామ అల్లుడు మధ్య తగాదా... మామ మృతి... అల్లుడుకు తీవ్ర గాయాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE




