728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2021

చిలకలూరిపేట: నేటి నుంచి 2గంటల వరకే

చిలకలూరిపేట: పట్టణ, మండలంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని పట్టణ మరియు మండలంలో నేటి నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం చేసుకోవాలని ఇన్సిడెంట్ కమాండర్ మల్లికార్జున్ రావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల అనంతరం పట్టణం మరియు మండలంలో కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. హోటల్లు నిర్వహించే వారు 2 గంటల అనంతరం పార్సిల్స్ మాత్రమే అనుమతి ఉందని తెలియజేశారు. రెండు గంటల అనంతరం ఆర్టీసీ డిపో వారు బస్ లను తిప్పకూడదని ఈ విషయం పై చర్యలు తీసుకోవాల్సిందిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తాసిల్దార్ తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నేటి నుంచి 2గంటల వరకే Rating: 5 Reviewed By: NEWS UPDATE