చిలకలూరిపేట పట్టణంలో చేపల వ్యాపారం చేస్తున్న వారు తూనికలు, కొలతల్లో మోసం చేస్తున్నారని గత కొద్దిరోజుల క్రితం లోక్ సత్తా నాయకులు భానుప్రసాద్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు మార్కెట్ సెంటర్లోని నరసరావుపేట తూనికలు కొలతల శాఖ అధికారులు యన్. అల్లూరయ్య, సిబ్బంది ఆదివారం తనిఖీలు నిర్వహించారు. తక్కువ తూకము పంపిణీ చేస్తున్నట్లు, ముద్రలు లేని ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నట్లు గుర్తించి ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అల్లూరయ్య మాట్లాడుతూ తూకాలు, కొలతలలో అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
చిలకలూరిపేటలో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు... కేసులు నమోదు