చిలకలూరిపేట: ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ మరియు విశ్వ యువక ఢిల్లీ కేంద్రం వారి సహకారంతో 50 వేల రూపాయల విలువ కలిగిన నిత్యావసరాలను 25 కరోనా బాధిత కుటుంబాలకు అసిస్ట్ సంస్థ డైరెక్టర్ రంగారావు చేతుల మీదగా అందజేశారు. ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, కిలో నూనె చొప్పున వీరికి అందజేశారు. ఈ సందర్భంగా అసిస్ట్ డైరెక్టర్ రంగారావు మాట్లాడుతూ కరోనా బాధిత కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తమ సంస్థ తరఫున సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ కృష్ణ హరీష్, విష్ణు ప్రియా, అసిస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహాయం పొందిన కుటుంబాలు వీరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
July 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: అసిస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

