చిలకలూరిపేట: యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో జరిగిన జగనన్న పాలవెల్లువ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్,జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్,ఎమ్మెల్యే విడదల రజిని. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కు ఈ రోజు మనమందరం రుణపడి ఉండాలి అని అన్నారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయం,పాడి పరిశ్రమ రెండు కలిసి ప్రయాణం చేస్తేనే రైతులకు మంచి ఫలితాలు వస్తాయి అని అన్నారు.మనం గాని పల్లెటూర్లలో చూసుకుంటే నాలుగు గేదెలు కొనుక్కొని వాటి ద్వారా పాలు సేకరించాలి అని రైతులు కోరుకుంటారు కానీ గేదెలని కొనాలంటే ఎక్కడో ఒకచోట అప్పు చేయాలి ఆ అప్పు కి వడ్డీ లు పడి రైతన్న దీనస్థితికి వెళ్తున్నారు,ఇది గమనించిన మా ముఖ్యమంత్రి జగన్ వై.యస్.ఆర్ క్రాంతి పధకం ద్వారా మహిళా రైతులందరికీ గేదెలు కొనుక్కోవడానికి సరిపడా ఆర్థిక చేయూతని అందించనున్నారు. ఇక పోషణ మహిళా రైతులదే,పాలు సేకరించేది మహిళా రైతులే లాభాలు తీసుకునేది కూడా మహిళా రైతులే అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ కరిమూన్ నాయకులు ఆలోకం లక్ష్మీనారాయణ,షేక్ మాబు సుభాని,శొంఠినేని కోటేశ్వరరావు,శొంఠినేని శివప్రసాద్,ఆలోకం శ్రీనివాసరావు,విప్పర్ల రామారావు,మొద్దు శ్రీనివాసరావు,మొద్దు రాంబాబు మరియు మహిళా రైతులు పాల్గొన్నారు.
July 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సీఎంకు అందరూ రుణపడి ఉండాలి: ఎమ్మెల్యే విడదల రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

