చిలకలూరిపేట: పదో వార్డు లో అంగన్వాడి కేంద్రం లో బాలింతలకు మరియు పిల్లల తల్లులకు పౌష్టికాహారం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, గుడ్లు, పాలు, కంది పప్పు, నూనె ను వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ పేదలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ అభయ హస్తం అందిస్తూ,పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు వలి, పార్టీ నాయకులు పఠాన్ మస్తాన్ వలీ, అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు..
September 12, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తోన్న ఎమ్మెల్యే... కౌన్సిలర్ మౌలాలి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

