చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామ శివారు పొలాలలో చెట్టుకు ఊరి వేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పర్చూరు మండలం తన్నీరువారిపాలెం గ్రామానికి చెందిన ఆళ్ళ సాంబశివరావు (40) పోలీసులు గుర్తించారు. ఇతను విజయనగరం జిల్లాలో కొంత పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్లు చిలకలూరిపేట రురల్ యస్.ఐ. యస్. రాజేష్ తెలిపారు. అయితే గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయంలో నష్టాలురావటంతో అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలూరిపేట రూరల్ యస్.ఐ. రాజేష్ తెలిపారు.
September 13, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట రూరల్: ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య
Rating: 5
Reviewed By: NEWS UPDATE

