చిలకలూరిపేట: బైక్ పై వెళుతూ గేదెలు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. చిలకలూరిపేట మండల పరిధిలోని లక్కీ రోడ్ లైన్స్ సమీపంలో జాతీయ రహదారిపై చిలకలూరిపేట నుండి బైక్ పై గొర్రె రాజా వంశీ అనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యద్దనపూడి వెళుతుండగా గేదెలు అడ్డురావడంతో బైకు అదుపు తప్పి పడడంతో అతను మృతి చెందాడు. ఇతను యద్దనపూడి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
September 26, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

