చిలకలూరిపేట: రైతు వ్యతిరేక చట్టాలు, పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ భారత్ బంద్ లో భాగంగా రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు చిలకలూరిపేటలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసి బస్ లు మధ్యాన్నం వరకు తిరగకుండా, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలని చెప్పటంతో పాఠశాలలు మూసివేసి, ఆర్టీసీ బస్ లు డిపోలోనే నిలిపివేశారు. చిలకలూరిపేట పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు మూసివేశారు. ఉదయం నుంచి వర్షం కురవడంతో ఎక్కడివారక్కడ వ్యాపార లావాదేవీలు నిలిపి వేసి షాపులు మూసివేశారు. ఈ బంద్ లో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, నవతరం, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ బంద్లో పాల్గొన్నారు. ఈ బందులో చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ (ఏపీయూడబ్ల్యూజే) తరఫున స్టేట్ కౌన్సిల్ మెంబర్ మస్తాన్వలి, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు అల్లాబక్షు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు దాసు తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు..
చిలకలూరిపేట లో భారత్ బంద్ ఎలా జరుగుతుందంటే...